Friday, November 8, 2024

బాబాయ్ కృష్ణారావు ఇకలేరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణారావు (64) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. నాయకులంతా బాబాయ్ గా పిలుచుకునే కృష్ణారావు ప్రస్థానం ఈనాడుతో మొదలై ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సాగింది.

నేతల సంతాపం
కృష్ణారావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్ర జా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని సిఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పై బడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సిఎం అ న్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతితెలిపారు. వివిధ హోదాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా జర్నలిజం రంగానికి అనేక సేవలు అందించిన కృష్ణారావు మరణం జర్నలిజానికి తీరని లోటని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రేమగా ‘బాబాయ్’ అని పిలుచుకునే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు కృష్ణారావు మృ తి బాధాకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. మరణవార్త తనను ఎంతోగానో కలిచివేసిందన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.కృష్ణారావు మృతి పట్ల బిజెపి నాయకులు కిషన్‌రెడ్డి, సంజయ్, ఈటల రాజేందర్, డికె అరుణ,కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క,మధుయాష్కీ, సినీ నటుడు బాలకృష్ణ, టి టిడిపి నాయకులు కాసాని జ్ఞానేశ్వర్,రావుల చం ద్రశేఖర్ తమ సంతాపాన్ని తెలిపారు.

పత్రికా రంగానికి తీరనిలోటు : దత్తాత్రేయ
కృష్ణారావు మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. నాలుగు దశాబ్దాలుగా రంగానికి సే వలతో, జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని, వారి మృతి ప త్రికా రంగానికి తీరనిలోటని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
మంత్రి హరీశ్‌రావు నివాళి
కృష్ణారావుకు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నివాళర్పించారు. గురువారం గౌలిదొడ్డిలోని జర్నలిస్ట్ కాలనీలో కృష్ణారావు నివాసాన్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు : అశోక్ రెడ్డి
47 ఏళ్లుగా దిన పత్రికల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన సి హెచ్ విఎం కృష్ణారావు మృతి పట్ల సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ కె. అశోక్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నైతిక విలువలతో కూడిన రాజకీయ విశ్లేషణలు చేయడంలో కృష్ణారావు గడించారన్నారు.

అన్ని అంశాల్లో సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి: ‘మన తెలంగాణ’ ఎడిటర్ పొలిశెట్టి అంజయ్య
సీనియర్ పాత్రికేయుడు సిహెచ్ కృష్ణారావు అన్ని అంశాల్లో స మగ్ర అవగాహన ఉన్న వ్యక్తి అని ‘మన తెలంగాణ’ ఎడిటర్ పొలిశెట్టి అంజయ్య అన్నారు. సమకాలీన రాజకీయాలపై నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే అతి కొద్దిమందిలో కృష్ణారావు ఒకరని, పత్రి కా రంగానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు అన్ని విధాలుగా అం డగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News