Thursday, January 23, 2025

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సోదరుడికి హరీశ్‌రావు నివాళి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సోదరుడు గుగులోతు కిషన్ నాయక్ దశదిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కురవి మండలం పెద్దతండా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.ఎస్. రెడ్యానాయక్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్‌లు కిషన్ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు కిషన్ నాయక్ కుటుంబ సభ్యులను హరీశ్‌రావు ఓదార్చారు.

కిషన్‌నాయక్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిషన్ కుమారుడు గుగులోత్ శ్రీరామ్‌నాయక్‌తో పాటు కుటుంబ సభ్యులను ప్రముఖులు హాజరై ఓదార్చారు. ఎంపి మాలోతు కవిత, జడ్పీ చైర్‌పర్సన్ కుమారి అంగోతు బిందు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, బానోత్ హరిప్రియ, ముత్తిరెడ్డి యాదరగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు జాన్సన్ రాథోడ్, పెద్ది స్వప్న, నూకల నరేష్‌రెడ్డి, బన్నాల గీత ప్రవీణ్, బండి వెంకట్‌రెడ్డి, కొంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కిషన్‌నాయక్ కుటంబాన్ని పరమార్శించిన వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News