తన జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు అని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. ఆచార్య జయశంకర్ 89వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… “తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి అంటే నీళ్లు.. నిధులు.. నియామకాల లక్ష్యం చేరేందుకే అని జయశంకర్ సార్ ఎప్పుడు మాట్లాడేవారు. నేడు కాళేశ్వరం జలాలతో కోటి ఎకరాల మాగాణిగా చేసుకున్నాము. నిధుల్లో దేశంలో నే ధనిక రాష్ట్రం గా దేశాన్ని సాదుతున్న మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ ఊతం ఇస్తున్నది.
నియమాకాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది.. మరో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. ఇది ఆచార్యుని కలలు కన్న నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారిది. నాడు జయశంకర్ సర్ గారు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అణువునవును చూసి అవమానం.. బాదను దిగమింగుతూ కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్పే వారు. అలాంటి వారి కల నేడు నెరవేరుతున్న సందర్భంలో వారు ఉంటే ఎంతో సంతోష పడేవారు. ఆచార్య జయశంకర్ గారు టిఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ గారికికి చేదోడువాదోడుగా ఉంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సూచనలు, సలహాలు అందించారు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన పోరాటం పటిమ, ఆయన తపన రాష్ట్ర సాధనలో అయన కృషి ఎవరు మర్చిపోలేరు. ఆచార్యుని ఆశయాలని నిరంతరం కొనసాగిసిస్తాం” అని పేర్కొన్నారు.