- Advertisement -
హైదరాబాద్: అన్ని మౌలిక వసతులతో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. హరితహారంపై మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. అన్ని వసతులతో అభివృద్ధి చెందే అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటి నిలుస్తుందని ప్రశంసించారు. తెలంగాణ పచ్చని చెట్లతో 7.7 శాతం వృద్ధిలో ఉన్నామని చెప్పారు. గత పదేళ్ల నుంచి 14,864 నర్సరీలు, 19472 పల్లె ప్రకృతి వనాలు, 13.44 లక్షల ఎకరాలలో అటవీని అభివృద్ధి చేశామన్నారు. ఇప్పటివరకు 273 కోట్ల మొక్కలను నాటామని హరీష వివరించారు. పర్యావరణవేత్తగా మారిన సిఎం కెసిఆర్ సమగ్ర, స్థిరమైన అభివృద్ధి గురించి ఆలోచిస్తారని ప్రశంసించారు. ప్రభుత్వాలు ఏం చేయాలో ప్రపంచానికి కెసిఆర్ పాలనతో తెలిసిందని హరీష్ రావు కొనియాడారు. తెలంగాణ పాలనను కేంద్ర ప్రభుత్వం అనసరిస్తోందన్నారు.
Also Read: బాహుబలి సమోసా..తిన్నవారికి బహుమతి ఎంతంటే…
- Advertisement -