Sunday, February 23, 2025

దక్షిణ భారతదేశం నుంచి బిజెపి పతనం మొదలైంది: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దక్షిణ భారతదేశం నుంచి బిజెపి పతనం మొదలైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్‌రావు శనివారం ట్వీట్ చేశారు. అన్ని చోట్లా వారి అకౌంట్ క్లోజ్ అవుతుందని విమర్శించారు. తెలంగాణలో బిజెపికి డిపాజిట్ కూడా దక్కదని అన్నారు.

ఇది సౌత్ ఇండియా స్టోరీ అని, బిజెపి నుంచి కర్ణాటకకు విముక్తి లభించిందని, ఇప్పుడు, ఎల్లప్పుడూ ఇది అలాగే ఉంటుందని పేర్కొన్నారు. కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News