Monday, December 23, 2024

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… జాతీయ జెండాను ఆవిష్కరించిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

సిద్ధిపేట : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరులను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ముస్తాబాద్ సర్కిల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీసు కమిషనర్ శ్వేత, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: తెలంగాణ తీన్‌తెర్లు కాకుండా చూడాలె!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News