Sunday, December 22, 2024

చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే కెసిఆర్ పోరాటం..

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: ముఖ్యమంత్రి కెసిఆర్ బిసిలకు చేసే ఆర్థిక సాయం పథకాన్ని ప్రధాని మోడీ కాపీ కొట్టారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్ మాటలు చెప్పేవాళ్లయితే.. చేతల్లో చూపేది సీఎం కేసీఆర్ అని, మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీశ్ అన్నారు. 50 ఏళ్ల నుంచి చేయని అభివృద్ధి, ఇప్పుడు చేస్తామని బాండ్ పేపర్లు రాసిస్తున్నారని, కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీగా మంత్రి చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో మంగళవారం వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, జెడ్పీ చైర్మన్ రోజాశర్మలతోపాటు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వారంలోపు రజకుల పంక్షన్ హల్ కోసం స్థలం అప్పగిస్తానని హామీనిచ్చారు. సిద్దిపేట ఓపెన్ ఏయిర్ ఆడిటోరియంకు చాకలి ఐలమ్మ ఆడిటోరియంగా నామకరణం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఐలమ్మ అంటేనే ఉద్యమ స్ఫూర్తి అని పేదల పక్షాన పోరాడిన వీర వనిత అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పోరాడటం వల్లనే రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎంతో మంది ఉద్యమ కారులను గుర్తించి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నాం. టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు రజకులను పట్టించుకోలేదని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా 500 మంది రజకులకు ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రైతులకు ఇచ్చే రైతుబంధు, మిషన్ భగీరథ పథకాలు మోడీ కాపీ కొట్టారని, అయినా దేశంలో ఇప్పటికే 30శాతం మందికి నీళ్ళు అందుతున్నాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News