Thursday, January 23, 2025

18 ప్లస్ కు మూస్టర్ ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ టీకా కేంద్రాల్లో బూస్టర్ డోస్‌కు అనుమతివ్వండి
కేంద్రానికి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ విజ్ఞప్తి
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో
కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలో జరుగుతున్న టిబి నిర్మూలన, కంటి పరీక్షలు,
కరోనా వాక్సినేషన్ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రికి వివరించిన హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిక్షయ్ మిత్ర క్యాంపెయిన్, రాష్ట్రీయ నేత్ర జ్యోతి అభియాన్, హర్ ఘర్ దస్తక్ క్యాంపెయిన్ -2.0పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. రాష్ట్రంలో జరుగుతున్న టీబీ నిర్మూలన, కంటి పరీక్షలు, కరోనా వాక్సినేషన్ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సమీక్షలో సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, సిఎం ఒఎస్‌డి గంగాధర్, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి చంద్రశేఖర్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…ప్రభుత్వ అధ్వర్యంలో అర్హులైన వారందరికీ ప్రికాషనరీ డోస్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద 32 లక్షల వాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయని, గడువు తేదీ ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అర్హులకు ప్రికాషనరీ డోసు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో రెండు డోసులు పూర్తి చేసుకొని అర్హులైన వారికి ప్రికాషనరీ డోస్ ఇవ్వడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుందన్నారు.
వేగంగా వ్యాక్సినేషన్
రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతుందని మంత్రి హరీశ్ రావు కేంద్ర మంత్రికి వివరించారు. జూన్ 3న రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటింటికి వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి వాక్సిన్ వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 12 ఏళ్లు పై బడిన వారికి మొత్తంగా.. మొదటి డోసు 104.78 శాతం, రెండో డోసు 99.72 శాతం పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కరోనా పరిస్థితులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నదని, దానికి అనుగుణంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అర్‌టిపిసిఆర్ పరీక్షలు మరింత పెంచనున్నట్లు తెలిపారు. టీబీ నిర్మూలన కోసం అమలు చేస్తున్న నిక్షయ్ మిత్ర కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తామని చెప్పారు. కంటి ఆపరేషన్లు మరింత పెంచేలా టీచింగ్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో పేఖో మిషన్లు సమకూర్చి, లక్ష్యం చేరుతామని తెలిపారు.

Harish Rao video conference with Union Health Minister

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News