సిద్ధిపేట: జిల్లాలోని నారాయణరావుపేట మండలం దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్ లో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో 37మంది లబ్ధిదారులతో కలసి డబుల్ బెడ్ రూమ్ లలో గృహా ప్రవేశాల కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, కిచెన్ అండ్ డైనింగ్ షెడ్, సామూహిక పాడి పశువుల వసతి సముదాయం, డ్రోన్ ద్వారా పంటలపై పిచికారీ ప్రారంభించి, ప్రయోజనాలపై వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించారు. ఫోన్ మెస్సేజ్ ద్వారా మోబైల్ యాప్ ద్వారా మోటారు ఆపరేట్ చేసే పంప్ రూమ్ ప్రారంభించారు. అనంతరం నాట్కో సహకారంతో మోబైల్ క్లినిక్ ప్రారంభించారు. ఈ మేరకు గ్రామానికి సహకరించిన ప్రముఖులను శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”సమిష్టిగా ఉంటేనే మీ గ్రామానికి గౌరవం వచ్చింది. ఐకమత్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రజలకు శుభాకాంక్షలు. గొర్రెలు, పాడి పశువుల హాస్టల్స్ ఉపయోగించుకుంటే.. రైతులకు మేలు జరుగుతుంది. అలాగే గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది. పశువులు పాటలు విని పాలు ఎక్కువగా ఇస్తవి. గ్రామంలో హెల్త్ సెంటరు ఏర్పాటు చేశాం. 70 రకాల వైద్య పరీక్షలు జరుగుతాయి. ఈ గ్రామ ప్రజలందరీ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి. రూ.50 లక్షలతో డైనింగ్ హల్ నిర్మించుకున్నాము. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇబ్రహీంపూర్ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం అమలు అవుతుంది. రాబోయే రోజుల్లో దళిత బంద్ అమలు చేపిస్తా” అని పేర్కొన్నారు.
Harish Rao visit Adopted Village Ibrahimpur