Thursday, November 21, 2024

ఏడుపాయల ఉత్సవాలు దినదినాభివృద్ధి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao visit Edupayala Temple

 

హైదరాబాద్: తెలంగాణలో కోటి ఎకరాల పంట సాగు అవుతోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను మంత్రి హరీష్ సమర్పించారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. దేశంలోని కోటి ఎకరాలు సాగు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర పుటల్లోకి ఎక్కిందన్నారు. సిఎం కెసిఆర్ నిరంతర కృషితో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. రూర్బన్ పథకం నుంచి ఏడు పాయంలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశామని, అన్ని సౌకర్యాలతో ఆర్‌టిసి బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఏడుపాయల ఉత్సవాలు దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. జాతర కోసం సింగూరు నుంచి 0.35 టిఎంసిల నీటిని విడుదల చేశామని, పోతం శెట్టిపల్లి నుంచి రూ. 36 కోట్లతో వంద ఫీట్ల రోడ్డును అందుబాటులోకి తెస్తామన్నారు. అమ్మవారి దయతో ఈ ప్రాంతం సుభిక్షమవుతోందని, కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సస్యశామలం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News