Monday, January 20, 2025

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టినట్లు సిద్ధిపేట బోనాల పండుగ

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: ఆషాఢ మాసం పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టినట్లు సిద్ధిపేట పట్టణంలో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారని, ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ కాలం తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, మంచి పంటలు పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరోప్, వివిధ దేశాలలో ఉండే తెలంగాణ ప్రాంత వాసులు ప్రపంచ వ్యాప్తంగా బోనాల పండుగ జరుపుతూ మన ప్రాంత, ప్రజల సంస్కృతి, సంప్రదాయం కాపాడే ప్రయత్నం జరుగుతున్నదని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు పట్టణ ఐదవ వార్డులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో జరుగుతున్న బోనాల జాతర ఉత్సవంలో ఆదివారం హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బోనాల పండుగ పెద్దగా తెలంగాణ ప్రజలు ఎంతో సంప్రదాయంగా గొప్పగా ఈ ఆషాడ మాసంలో జరుపుకునే పండుగగా తెలిపారు. ఈ పండుగ తమ సంప్రదాయ పద్ధతిలో అక్కచెల్లెలు బోనాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, దుష్టశక్తుల నుంచి రక్షణ కల్పించాలని అమ్మవారిని ప్రార్థిస్తుంటామని తెలిపారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం కాపాడాల్సిన బాధ్యత మనపై ఉన్నదని, ఎంత చదివినా, దేశ, విదేశాలకు వెళ్లినా మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందజేసే విధంగా అందరూ కలిసికట్టుగా ఈ సంప్రదాయం నిలబెట్టడానికి కొసాగించడానికి కృషి చేయాలని కోరారు. పట్టణంలోని వాడ వాడల పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ అమ్మవార్ల బోనాల ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు గ్రామ దేవత అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. ప్రతీ ఆలయం వద్ద డప్పు, చప్పుళ్ల దరువుల నడుమ మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News