Thursday, January 23, 2025

తల్లిబిడ్డలకు తిప్పలు కావద్దన్నదే నా తండ్లాట: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao visit Siddipet govt hospital

సిద్ధిపేట: తల్లిబిడ్డలకు తిప్పలు కావొద్దన్నదే తన తండ్లాటని, డెలివరీకై వచ్చిన గర్భిణీకి ఆపరేషన్ చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తీసుకరావొద్దని, డిశ్చార్జి కాగానే ఇంటికి పోయేటప్పుడు అవసరమైన మందులు ఇస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో మంత్రి హరీష్ రావు పర్యటించారు

జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పునరుద్ధరణలో భాగంగా ఎమర్జెన్సీ వార్డు- క్యాజువాలిటీ, ఓపీ, ఫార్మసీలను మంత్రి ప్రారంభించారు. మునుపటి లెక్క ఉందా..ఇప్పుడు ఆసుపత్రి ఎట్లుంది అమ్మా.. అంటూ ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులతో మంత్రి ఆప్యాయంగా పలకరింపులతో పరిశీలిస్తూ.. ఆసక్తికరంగా సంభాషించారు. ఆసుపత్రి పునరుద్ధరణకు కృషి చేసిన వైద్య విభాగ ఇంజనీర్లను వెల్ డన్ అంటూ హరీష్ రావు అభినందించారు. ఈ మేరకు దవాఖానకు వచ్చిన వారి బంధువులతో కాసేపు ముచ్చటించారు. పలువురిని ఆసుపత్రి బాగుందా.. వైద్య సేవలు ఏలా ఉన్నాయంటూ.. అడిగి తెలుసుకుంటూ.. ఆరా తీశారు. నార్మల్ డెలివరీపై ఆవశ్యకత తెలుపుతూ అవగాహన కల్పించారు. తల్లికి నొప్పులు వస్తున్నాయంటూ.. వైద్యులపై ఒత్తిడి తెచ్చి పెద్ద ఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకరావొద్దని, దానివల్ల తల్లి, బిడ్డలకు ఏర్పడే దుష్ఫలితాల గురించి హరీష్ రావు వివరించారు.

ఏ ఊరు నుంచి వచ్చారమ్మా.. మీరు అంటూ మీ బిడ్డకు నార్మల్ డెలివరీ జరిగిందా? లేదా ఆపరేషన్ చేశారా? అని ఆరా తీశారు. తల్లి బిడ్డకు తిప్పలు కావద్దన్నదే నా తండ్లాటగా చెబుతూ.. డెలివరీ సమయంలో ఆపరేషన్లు చేయించొద్దని సూచించారు. నార్మల్ డెలివరీలు అయ్యే వరకు వేచి చూడాలని, డాక్టర్ల పైకి కోపానికి రావొద్దని నిజాంపేట నుంచి వచ్చిన పేషంట్ బంధువులకు సవివరంగా అవగాహన కల్పించారు. ఆసుపత్రి ఆవరణ ప్రాంతం కలియ తిరిగి గార్డెనింగ్, ఎమర్జెన్సీ వార్డు, ఫార్మసీ బాగున్నాయని  వైద్యాధికారుల తీరుపై హరీష్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ విమలా థామస్, సూపరింటెండెంట్, ప్రముఖ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News