- Advertisement -
వరంగల్: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు, ఈవో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మంత్రిని ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి హరీశ్‌రావు వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Harish Rao Visit Warangal Bhadrakali Temple
- Advertisement -