యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సతీసమేతంగా గురువారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గ పక్షాన యాదాద్రి ఆలయ గోపుర బంగారు తాపడ నిర్మాణానికి కిలో బంగారాన్ని స్వామికి మంత్రి హరీష్ రావు దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ”యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దాదాపు పూర్తి అయింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట నియోజక వర్గం నుండి ఒక కిలో బంగారం సమర్పించడం జరిగింది. మరో కిలో బంగారం కూడా సమర్పిస్తాం. ఇప్పటివరకు దాతల నుండి,భక్తుల నుండి దాదాపు 35 కేజీల బంగారం సమర్పించారు. మరో 45 కేజీల బంగారం దాతలు ఇతర భక్తులు ఇస్తాం అని చెప్పారు. బంగారు గోపురం తాపడానికి కావాల్సిన బంగారం దాతల నుండి అందుతుంది. సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రత్యెక శ్రద్ధతో అద్భుతంగా నిర్మాణం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోనే గొప్ప ఆలయంగా యాదాద్రి ఆలయం ఉంటుంది. రానున్న రోజుల్లో మంచి పర్యటక, ఆధ్యాత్మిక ప్రదేశంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిలుస్తోంది. ఎమ్మెల్యే ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ను అడిగారు తప్పకుండా ఏర్పాటు చేస్తాం” అని పేర్కొన్నారు.
Harish Rao visit Yadadri Temple