Monday, December 23, 2024

తలసేమియా బాధితులకు రక్తం అందిస్తాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్యాగాలతో కూడిన ఉద్యమ ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం లభించిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భంగా సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు శిబిరాన్ని సందర్శించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రక్తదాతలను ఆప్యాయంగా పలకరిస్తూ.. రక్తదాన ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా అన్నీచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, స్వాతంత్ర్య ఉద్యమం అంటేనే ఎన్నో త్యాగాలు, మహనీయుల స్ఫూర్తిని స్మరిస్తూ ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఎందరో మహానీయుల ఉద్యమం త్యాగాల వల్లనే మనం ఇవాళ స్వేచ్ఛ వాయువులను పీల్చుతున్నామని కొనియాడారు. ప్రమాదాల్లో రక్తం కోల్పోయిన వారికి, తలసేమియా బాధితులకు ఈ రక్తం అందిస్తామని వివరించారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, మరో పునర్జన్మ ఇచ్చేది రక్తదానమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News