- Advertisement -
హైదరాబాద్: ఎస్‌బి ఆర్గానిక్ ప్రమాద ఘటనలో క్షతగాత్రులను బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు పరామర్శించారు. ఎంఎన్‌ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులను రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని కోరారు. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మంత్రుల పరామర్శలు, కంటితుడుపు చర్యలు పనికిరావని చెప్పారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని చందాపూర్ గ్రామ శివారులో ఎస్ బి ఆర్గానిక్ రసాయన పరిశ్రమలో బుధవారం బాయిలర్ ఆయిల్ రియాక్టర్ పేలి సంస్థ డైరెక్టర్‌తో సహా ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
- Advertisement -