రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా మహా శివరాత్రి వేడుకలు, శైవక్షేత్రాల్లో బారులు తీరిన భక్తులు
వేములవాడ, ఏడుపాయలలో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్
మన రాష్ట్రంలో మహా శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వచ్చి శివుడిని దర్శించుకున్నారు. శివరాత్రిని పురస్కరించుకొని ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. శివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు బారులు తీరారు. ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ పలికారు. మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం గ్రామంలోని రామేశ్వర ఆలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి పూజలు నిర్వహించారు. కరీంనగర్‌లోని వీణవంకలో మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా అక్కపల్లి ఆలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పూజలు చేశారు.
త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, ముక్తీశ్వరస్వామికి అభిషేకాలు, పూజలను భక్తులు చేశారు. హన్మకొండ వేయిస్తంభాల గుడిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక పూజలు జరిపారు. సిద్ధేశ్వరాలయం, వేయిస్తంభాల గుడికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకు రుద్రేశ్వరస్వామి కల్యాణోత్సవం వీక్షించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
కీసరలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం
మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. కీసరగుట్టలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు నిర్వహించారు. రుద్రస్వాహాకార హోమం, నంది వాహన సేవ చేశారు. ఓం నమశ్సివాయ అనే మంత్రాక్షరితో కీసరగుట్ట దేదీప్యమానంగా వెలిగిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
వేడుకగా ఏడుపాయల జాతర
మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లిలో ఏడుపాయల జాతర గురువారం ఉదయం వైభవంగా ప్రారంభమైంది. వనదుర్గా భవానీ తరఫున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఎంఎల్‌ఎలు పద్మా దేవేందర్ రెడ్డి, మధన్‌రెడ్డిలు పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దయతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారిందని మంత్రి సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే శక్తిని ప్రసాదించాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ప్రార్థించారు.
Harish Rao visits Edupayala Temple on Maha Shivaratri