టిబిఎం కటింగ్ అనుమతికి నాలుగు రోజులా? ఆదరాబాదరా
నిర్ణయాలతో ప్రాణాలకు ముప్పు.. ప్రాజెక్టు బలి ఎస్‌ఎల్‌బిసి
టన్నెల్ వద్ద మీడియాతో బిఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్
అంతకుముందు టన్నెల్‌లోకి అనుమతించకపోవడంతో
రహదారిపైనే ధర్నా
మన తెలంగాణ/ అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బిసి ఇన్ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో చి క్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా బయటికి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు. గురువారం ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కలిసి టన్నెల్‌ను సందర్శించా రు. హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు చేరుకున్న మాజీ మంత్రికి పార్టీ జిల్లా అధ్యక్షు డు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, హాజీపూర్ వద్ద స్వాగతం పలికారు. అక్కడి నుండి భారీ కాన్వాయ్ నడుమ పార్టీ శ్రేణులతో కలిసి దోమలపెంటకు చేరుకున్నారు. ఎస్‌ఎల్‌బిసి ఇన్ టన్నెల్ వద్దకు వెళ్లేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు
అనుమతించలేదు. పది మంది ముఖ్య నేతలతో కలిసి వెళ్తామని చెప్పిన వినకపోవడంతో జెపి క్యాంపు కార్యాలయం చెక్ పోస్ట్ వద్ద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేయడంతో లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మేము బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, రిలీఫ్ స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారో చూద్దామని, అవసరమైన సూచనలు ప్రభుత్వానికి చేద్దామని మేము ఇక్కడికి వచ్చాము. మాతో వచ్చిన నాయకులను లోపలికి అనుమతించలేదని అన్నారు. అయినా మేము సహకరించామని, తొలుత 8 నుంచి 10 మందికి లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తామని అన్నారు. ఆ తర్వాత అయిదు ఆరుగురు అన్నారు. ఆ తర్వాత ఒక్కరే పోవాలని అడ్డుకున్నారు. లోపలికి పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని, మేము బాధిత కుటుంబ సభ్యులను కలుద్దామని అనుకుంటే వాళ్లను కూడా కలవనీయకుండా చేశారని అన్నారు.
వాళ్ల కుటుంబ సభ్యులను ఇక్కడి నుండి పంపించేసి దాచిపెట్టిన పరిస్థితి ఉందని, ఈ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ అంటే ఎందుకింత భయమని అన్నారు. టన్నెల్‌లో చిక్కుకొని ఇప్పటికి ఆరు రోజులైంది. వారి గురించి తెలుసుకునేందుకు సిటి ఎన్‌డిఆర్‌ఎఫ్ టీంతో మాట్లాడాను. వారి సేవలు అభినందనీయం. చివరి పాయింట్ వరకు వెళ్లినట్లు చెప్పారు. చివరి పది మీటర్స్‌లో కేవలం 1.2 మీటర్లు మాత్రమ స్పేస్ ఉందన్నారు. కానీ అక్కడ ఆక్సీజన్ సరిగ్గా లేదని అన్నారు. అక్కడి పరిస్థితులు చూస్తే గత 5, 6 రోజుల నుంచి వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం లోపం ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. ఎవరు ఏం పని చేయాలనే లోపం ఉందని, వారికి ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదని అన్నారు. ఆరు రోజుల వరకు డైరెక్షన్ ఇయ్యకుండా ప్రభుత్వం ఉండడం సిగ్గు చేటని, ఇన్ని రోజుల వరకు డైరెక్షన్ ఇయ్యకపోతే లోపల ఉన్న వాళ్ల ప్రాణాలు ఏమైపోతాయని, అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందా అని ప్రశ్నించారు. ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా..?మంత్రులు పొద్దున్నే వచ్చి, సాయంత్రం పోతున్నారని అన్నారు. హెలికాప్టర్ వేసుకుని ఆ ఎలక్షన్ ప్రచారాని పోతున్నారని, ముఖ్యమంత్రి ఇంత వరకు రాలేదని, డైరెక్షన్ లేదు, ఓ మంత్రి రోజు సాయంత్రం వస్తుండని విమర్శించారు.
ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటదా అని ప్రశ్నించారు. గంటల్లో మరమ్మత్తు చేయగలిగే కన్వేయర్ బెల్ట్‌కు ఇన్ని రోజులు తీసుకోవడం ఎక్కడా చూడలేదన్నారు. ప్రమాదంలో ధ్వంసమైన టీఎన్‌ఎంను కత్తిరించేందుకు అనుమతికి ఐదు రోజులు తీసుకోవడం ఎంటన్నారు. దీని వల్ల లోపల ఉండే వాళ్ల ప్రాణాలు ఏం కావాలి అని నిలదీశారు. తొందరగా నిర్ణయం తీసుకుని ఫాస్ట్‌గా డీ వాటరింగ్ చేసి లోపలున్న బాధితులను రక్షించాలన్నారు. లోపల చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అని నిలదీశారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని మంత్రి చెబుతున్నారు. ఇక్కడ వాస్తవాలు వేరుగా ఉన్నాయని అన్నారు. బాధితులను కాపాడాలని మేము కోకుంటే వాళ్లేమో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ నిర్లక్షం వల్ల టన్నెల్ ప్రమాదమని చెప్పడానికి సిగ్గుండాలని అన్నారు. పని ప్రారంభించేటప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా.. ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి. లేదు నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ పర్మిషన్ ఉంటే రిపోర్ట్ బయట పెట్టండన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టుకు రూ. 3300 కోట్ల పని జరుగుతే మా తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో 3900 కోట్ల పని జరిగిందన్నారు. కరోనా వచ్చిన అధిక పని చేశామన్నారు.
సీపేజ్ వాటర్ పది వేల లీటర్లు వచ్చిన అన్ని జాగ్రత్తలు తీసుకుని పని చేశామన్నారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే ఆరు రోజులు సమయాన్ని వృధా చేశారన్నారు. రాష్ట్రం కోసం ప్రాజెక్టు కడుతున్న వాళ్ల ప్రాణాలను కాపాడడంలో నిర్లక్షం వహిస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ 15 నెలల పాలనలో నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయన్నారు. ఇప్పటికే శ్రీశైలం మొత్తం ఖాళీ అయ్యిందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు ప్రాజెక్టు నీళ్లే ప్రధానమన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు ఖాలీ అవుతుంటే ప్రభుత్వం నిద్రపోతుందా అన్నారు. శ్రీశైలం నుంచి ముచ్చమరి, పోతిరెడ్డిపాడు నీళ్లు తరలిస్తున్న ఆపే బాధ్యత ప్రభుత్వానికి లేదా అన్నారు. రెండు ప్రాజెక్టుల పరిధిలో దాదాపు పది లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ఏపి అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. బిఆర్‌ఎస్ ముళ్లుకర్రతో అదిలిస్తేనే ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, లకా్ష్మరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.