Sunday, January 19, 2025

అప్పులపై దద్దరిల్లిన అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

మీ హయాంలోనే భారీగా అప్పులు చేశారంటూ డిప్యూటీ సిఎం భట్టి
విక్రమార్క, మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పరస్పర
ఆరోపణలు నిండు సభలో హరీశ్‌రావు అబద్ధాలు చెబుతున్నారని భట్టి
ఫైర్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.1.23లక్షల కోట్ల
అప్పుచేసింది మీరేనని భట్టిపై హరీశ్‌రావు ఆగ్రహం అధికార, విపక్ష
సభ్యుల మధ్య కొనసాగిన మాటల యుద్ధం

మేం చేసిన అప్పులు రూ. 52వేల కోట్లే
కాదు..ఏడాదిలో రూ. లక్షా 23వేల
కోట్లు డిప్యూటీ సిఎం భట్టి ,
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ వాగ్యుద్ధం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ స మావేశాల్లో భాగంగా జరిగిన మూడో రోజు రాష్ట్ర అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం తో సభ దద్దరిల్లింది. మీ హయాంలోనే భారీగా అ ప్పులు చేశారంటే, కేవలం ఏడాది పాలనలోనే లక్ష కోట్లకుపైగానే మీరే అప్పులు చేశారంటూ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మాజీమంత్రి, బిఆర్‌ఎస్ ఎ మ్మెల్యే హరీశ్‌రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మంగళవారం ఉదయం 10 గంటలకు శా సనసభ సమావేశాలను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మార్ ప్రశ్నోత్తరాలతో ప్రారంభించారు. రాష్ట్ర అ ప్పులు, ఎఫ్‌ఆర్‌బీఎమ్ పరిమితిపై బిఆర్‌ఎస్ ఎమ్మె ల్యే హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రాష్ట్ర అప్పుల వివరాలను సభలో ప్రకటించారు. నిండు సభలో అప్పుల విషయంలో బిఆర్‌ఎస్ వాస్తవ విరుద్దంగా మాట్లాడుతోందని భట్టి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2024 నవంబర్ వరకు రూ.1.23 లక్షల కోట్లు అప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. తాము ఇప్పటి వరకు చేసింది రూ.52 వేల కోట్ల అప్పు మాత్రమేనని తెలిపారు.

బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన అప్పుల్లో గడిచిన ఏడాది కాలంలో రూ.66 వేల కోట్ల అప్పులను తమ ప్రభుత్వం తీ ర్చిందని అన్నారు. రూ.40 వేల కోట్ల పెండింగ్ బి ల్లులు ఉండగా వాటిలో నేటికి రూ.14 వేల కోట్లు చెల్లించామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వ అప్పు లు తీర్చేందుకు ఎక్కువ అప్పులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. హరీశ్ రావుకు ఏనాడు నిజం చెప్పే అలవాటు లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అయితే భట్టి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్య క్తం చేశారు. అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని మం డిపడ్డారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉం దనేది పూర్తిగా అవాస్తవని ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తానని హరీశ్ రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ. లక్ష 23 వేల కోట్లు అప్పు చేసిందని అన్నారు. ఈ క్రమంలో హరీష్ రావు వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష కోట్లు పైబడి అప్పు చేయలేదని, రూ.52 వేల కోట్లు మాత్రమే రుణం తీసుకుందని వివరణ ఇచ్చారు.

గత ప్రభుత్వం ప దేండ్ల పాలనలో తప్పులు ఇప్పుడు తాము సరిచేస్తున్నామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అ ప్పులకు వడ్డీలు కట్టడానికే సగం డబ్బులు అయిపోతున్నాయని విమర్శించారు. పౌరసరఫరాల శాఖ లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉంచితే రూ.14 వేల కోట్లు ఇ ప్పటికే చెల్లించామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వ అప్పుకు వడ్డీ చెల్లించాలని కొంత అప్పు తీసుకోవ డం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ భూ ములను తనఖా పెట్టడం కానీ, అమ్ముకోవడం కా నీ చేయకూడదని, ప్రభుత్వ భూముల్ని ప్రజా శ్రే యస్సు కోసమే వాడుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.బిఆర్‌ఎస్ వాళ్లలాగా ఆ స్తులు అమ్ముకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్ర భుత్వ హయాంలో సంపాదించిన ఔటర్ రింగ్ రో డ్డును 30 ఏళ్లకు మీరు టోల్ వసూలు చేసుకోం డి, ఆ డబ్బు మాకు ముందే కట్టేసి వెళ్లిపోండి అని ఓఆర్‌ఆర్‌నుఎవరికో లీజుకు ఇచ్చారని విమర్శించారు.

మా హయాంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేశామన్నది అవాస్తవం
తమ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి రూ.4.47 లక్షల కోట్ల అప్పు ఉంటే, దానిని రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టుగా చెబుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డా రు. ఇది పూర్తిగా అవాస్తవం, దుష్ఫ్రచారం మా త్రమేనని ఖండించారు. అందుకే తాము రాష్ట్ర అ ప్పులపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని స్పష్టం చేశా రు. అయితే, తాము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ ఈ సమావేశాల్లోనే చర్చ పెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలోనే రూ.1.27 వేల కోట్ల అప్పు చే సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లెక్క న రాబో యే ఐదేళ్లలో ప్రభుత్వం రూ.6.36 లక్షల కోట్ల అ ప్పు చేయబోతోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అ ప్పుల పూర్తి లెక్కలపై తాము స్పష్టంగా వివరించి చెప్పామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News