Monday, December 23, 2024

కాంగ్రెస్ వచ్చేది లేదు సచ్చేది లేదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: కాంగ్రెస్ వాళ్ళు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ చేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో మొదట డిక్లరేషన్ చేయాలని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వెయ్యి రూపాయల పింఛన్ మత్రమే ఇస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో మాత్రం అంత ఇస్తాం ఇంత ఇస్తాం అని నోటికి ఏదోస్తే అదే మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ల నోటికి మొక్కాలని, వాళ్ళు తెలంగాణలో వచ్చేది లేదు సచ్చేది లేదని హరీష్ రావు చురకలంటించారు. బిజెపి ఎంపి బండి సంజయ్ కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో బండి పోతే బండి ఇస్తామన్నారని, ఇప్పటికి బండి లేదు..గుండు లేదని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News