హైదరాబాద్: సంగారెడ్డిలో ఖచ్చితంగా బిఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. డిసిసిబి ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్లారు. ఫసల్‌వాదిలోని పట్నం మాణిక్యాన్ని ఆయన నివాసంలో హరీష్ రావు కలిశారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. పట్నం మాణిక్యానికి బిఆర్‌ఎస్ పార్టీలో మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ద్రోహులు ఒకవైపు, కెసిఆర్ మరొక వైపు ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, మంటలు, గ్రూపు గొడవలు అని మండిపడ్డారు. ధరణి వొద్దంటే పటేల్ వ్యవస్థ మళ్లీ తెచ్చినట్టేనని హరీష్ రావు చురకలంటించారు. ఉద్యమకారులపై తుపాకీ పెట్టిన వ్యక్తుల రాష్ట్రం కోసం పాకులాట అని, ఇతర పార్టీల్లో ఓటుకు నోటు, ఓటుకు సీటు అనే వాళ్లు ఉన్నారని ధ్వజమెత్తారు. ప్రజలు మాత్రం కెసిఆర్ వైపు నిలవాలని ఆశిస్తున్నారని, కెసిఆర్ చేతుల్లో ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఎవరు ఎన్ని మాట్లాడిని హ్యాట్రిక కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, మంటలు, గ్రూపు గొడవలు: హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -