Thursday, December 26, 2024

అబద్దాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: అబద్దాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హరీష్ రావు సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ ముషీనము శ్రీనివాస్ (మాంగోలు ), కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, ఎన్ ఎస్ యు ఐ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు శ్రావణ్ తదితరలు చేరారు. వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడారు. చంటి పిల్ల కన్న తల్లి చేతుల్లో ఎంత క్షేమంగా ఉంటుందో కెసిఆర్ చేతుల్లో తెలంగాణ అంత సురక్షితంగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ తక్కువ అని, అధికారం మీద యావ ఎక్కువ అని మండిపడ్డారు. అబద్దాలతో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ తో జాగ్రత్త గా ఉండాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో పదికి పది మనమే గెలవ బోతున్నామని హరీష్ రావు జోస్యం చెప్పారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి తాము ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పారని, మన రాష్ట్రం లో గత 8 ఏళ్లుగా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.

రైతు బందు సృష్టి కర్త మన కెసిఆర్ అని, నేడు తెలంగాణ లో బంగారంల రెండు పంటలు పక్కాగ పండుతున్నాయని, అది కెసిఆర్ ఘనత ప్రశంసించారు. ఒక నాడు కరువుతో ఉన్నామని, నేడు సస్యశ్యామలంగా మార్చుకున్నామని చెప్పారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కి అధికారం ఇస్తే 10 ఏళ్ళు వెనక్కి పోతామని, ఎండాకాలంలో కూడా చెరువులు, చెక్ డ్యామ్ లు, వాగులు వంకలు జలకళతో విరాజిల్లుతున్నాయని హరీష్ రావు ప్రశంసించారు. నేడు రాష్ట్రంలో అభివృద్ధిలో ముందున్నామని, సంక్షేమంలో ముందున్నామని చెప్పారు. బి ఆర్ ఎస్ పార్టీ కొత్త మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, కెసిఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా కానుందని, గ్యాస్ సిలెండర్ 400కే ఇవ్వబోతున్నామని, రైతు బందు, ఆసరా పెన్షన్ లు పెంచుకోబోతున్నామని, నేడు కర్ణాటక లో పెన్షన్ రూ 600, మూడు రోజులకు ఒకసారి త్రాగు నీరు, రైతు బందు కళ్యాణ లక్ష్మి లేనే లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కి అధికారం ఇస్తే మన వేళ్లతో మన కన్ను పొడుచుకున్నట్టేనని, అందరం కల్సి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News