Sunday, January 19, 2025

నల్లగొండ సభ పెడుతామనగానే తీర్మానం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పదేళ్లలో బిఆర్‌ఎస్ ఎప్పుడూ కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్టులు అప్పగించారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతపై గతంలో తాము అభ్యంతరం చెప్పామని, కృష్ణా ప్రాజెక్టులపై ప్రభుత్వం ఇచ్చిన నోట్‌లో పచ్చి అబద్ధాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. కృష్ణా ప్రాజెక్టులు, కెఆర్‌ఎంబి సంబంధిత అంశాలపై సభలో చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. నదీ జలాల అంశం సుప్రీంకోర్టులో ఉందని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. తాము కూడా ప్రజంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా కూడా స్పీకర్ ఇవ్వలేదని హరీష్ రావు అడిగారు. సభాపతి ఏకపక్షంగా మంత్రికే అవకాశం ఇవ్వడం తగదని, మంత్రి సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చారని చురకలంటించారు.

రేపు తాము నల్లగొండలో సభ పెడుతామని చెప్పడంతోనే అసెంబ్లీలో తీర్మానం పెట్టారని మండిపడ్డారు. అపెక్స్ కమిటీలో కెఆర్‌ఎంబికి ప్రాజెక్టులు అప్పగించినట్లు చెప్పడం అబద్ధమని, కెఆర్‌ఎంబి గెజిట్‌ను రివ్యూ చేయాలని అప్పటి ప్రభుత్వం కోరిందని దుయ్యబట్టారు. పదేళ్లుగా సిఎంగా పని చేసిన వ్యక్తిపై మంత్రి కోమటి రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కెసిఆర్‌పై చేసిన కోమటి రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కోమటి రెడ్డి బేషరుతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News