Friday, January 17, 2025

హరీశ్, సీతక్క పంచాయితీ

- Advertisement -
- Advertisement -

 సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులపై వాగ్యుద్ధం బిఆర్‌ఎస్ అంటే
బకాయిల రాష్ట్ర సమితి ఆనాడే హరీశ్‌రావు ఒక్క సంతకం పెట్టి
ఉంటే పంచాయతీలకు బిల్లులన్నీ క్లియర్ అయ్యేవి : మంత్రి సీతక్క
బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి సర్పంచ్‌లను గోస పెడుతున్నారు
తొమ్మిది నెలలుగా పంచాయతీ ఉద్యోగులకు జీతాలు లేవు కెసిఆర్
హయాంలో 19 పంచాయతీలకు జాతీయ అవార్డులు : హరీశ్‌రావు

మన తెలంగాణ / హైదరాబాద్ : సర్పంచుల పెండింగ్ బిల్లుల అంశంపై అసెంబ్లీలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. పంచాయతీలకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరు తూ బీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, పం చాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గత ప్రభుత్వం పంచాయతీలకు రూ. 690 కోట్లు పెండిం గ్‌లో పెట్టిందని, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఒక్క సంతకం చేసి ఉంటే ఆ బిల్లులన్నీ క్లియర్ అయ్యేవని అన్నారు. అ సలు బీఆర్‌ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి అని, ఎక్కడ పడి తే అక్కడ బిల్లులు పెండింగ్ పెట్టిందని చెప్పారు. అయితే మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపిటీసీలకు పెండింగ్ బిల్లులు చెలించడంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ చేశారు.

ప్రశ్నోత్తరాల సమయంలో సభలో బీఆర్‌ఎస్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వంపై వి మర్శలు గుప్పించారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. బి ల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారాన్ని తాకట్టు పెట్టి సర్పంచ్ లు పనులు చేశారని చెప్పారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని దీన స్థితిలో సర్పంచ్‌లు ఉన్నారని అన్నారు. తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుందని అమెరికాలో చెప్పుకుంటున్నారని, ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానమని హరీశ్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులు విడుదల కావడం లేదని చెప్పారు. పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.

గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత 9 నెలలుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, సర్పంచ్ లకు జీతాలు లేవని చెప్పారు. బిల్లులు, జీతాలను ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ పల్లెలను కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిపారని హరీశ్ రావు కొనియాడారు. గ్రామాలను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు క్లియర్ అవుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా గోస పెడుతున్నారని హరీష్ రావు అన్నారు. గవర్నర్‌ను వెళ్లి కలవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 19 గ్రామ పంచాయితీలకి అవార్డు తెచ్చిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. అయితే హరీష్ రావు ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణ ఇదేనా అధ్యక్ష అంటూ హరిష్ రావు సెటైర్ విసిరారు. ఆ తరువాత మాజీ మంత్రి తిరిగి మాట్లాడుతూ.. తెలంగాణకు వెళ్తే చికెన్ గున్యా వస్తుందని అమెరికా ఆ దేశ పౌరులను హెచ్చరించిందని, ఆ పరిస్థితికి పల్లెలను తెచ్చారని మండిపడ్డారు.

పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పెన్షన్స్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని తెలిపారు. పెన్షన్స్ ఏమో గాని అసలు వేతనాలే ఇవ్వడం లేదని హరీష్‌రావు విమర్శించారు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా రెండో రోజు సోమవారం సభ ప్రారంభం కాగానే సభలో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా సిటీ పేరిట ప్రభుత్వం నిర్బంధ భూసేకరణను ప్రతిఘటించిన అమాయక లగచర్ల రైతులను బంధించి, వారిని జైల్లో బంధించిన అంశంపై చర్చించేందుకు అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ తీర్మానాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రవేశ పెట్టగా దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కాలేరు వెంకటేశ్వర్లు, కొత్త ప్రభాకర్ రెడ్డి, విజేయుడు, మర్రి రాజశేఖర్ రెడ్డీలు సంతకం చేసి వాయిదా తీర్మానాన్ని అందించారు. కాగా బీఆర్‌ఎస్ పార్టీ లగచర్ల ఘటనపై చర్చించేందుకు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. కాగా అంతకు ముందు పెండింగ్ బిల్లులపై మంత్రి సీతక్క ఇచ్చిన వివరణకు నిరసనగా సభ నుంచి బీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.

బిల్లులు విడుదల చేయాలి : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి సర్పంచ్ బిల్లులు రాక ఇల్లును కుదువ పెట్టుకున్నారని తెలిపారు. బిల్లుల కోసం సర్పంచ్‌లు కలుద్దామని హైదరాబాద్‌కు వస్తే అరెస్టు చేస్తున్నారన్నారు. సర్పంచ్‌లు చేసిన పనుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పెండింగ్‌లు పెట్టిందే బీఆర్‌ఎస్ : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

సర్పంచుల బిల్లులు పెండింగ్ పెట్టిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్ బిల్లులు పెండింగ్ పెడితే ఆ బరువు తాము మోస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అన్ని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.1000 కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. పార్టీ కార్యాలయాలను కూడా వారు కబ్జాలు పెట్టారని నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

రైతులకు బేడీలు వేసిన నాయకుల నుంచి తాము నేర్చుకోవాలా? : కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్ర టూరిజంపై చర్చ పెడితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పారిపోయారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. బీఏసీ కమిటీ లో చర్చ జరుపకుండా పారిపోయారని సెటైర్ వేశారు. కనీసం సభాపతికి కూడా మర్యాద ఇవ్వడం లేదని సీరియస్ అయ్యారు. తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ఏనాడూ రైతులకు న్యాయం చేయలేదని గుర్తుచేశారు. రైతుల చేతులకు బేడీలు వేసిన నాయకుల నుంచి తాము నేర్చుకోవాలా? మండిపడ్డారు. అభివృద్ధిపై చర్చకు అందరూ సహకరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News