Monday, December 23, 2024

సిద్ధిపేట పేరు ప్రతిష్ట ఎల్లలు దాటాయి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

చిన్నకోడూర్: సిద్దిపేట దేశ పటంలో ఆదర్శంగా నిలిచి సిద్దిపేట పేరు ప్రతిష్టను ఎల్లలు దాటేలా చాటి చెప్పామని మంత్రి హరీష్ రావు తెలిపారు. చిన్నకోడూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్, మైలారం గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐ శ్రావణ్ రెడ్డి, నంగునూర్ మండల బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి తదితరులు మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీ లో మంత్రి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. సిద్దిపేట అభివృద్ధి మెచ్చుకొనెల చేసుకున్నామని, అన్నింటా అభివృద్ధి చేసుకొని దేశ స్ధాయిలో ఆదర్శంగా నిలిచామని చెప్పారు. ప్రతిపక్షాలు సైతం సిద్దిపేట అభివృద్ధి బాగుంది అంటున్నారు కానీ అభివృద్ధి కాలేదు అనే మాట అనడం లేదు అని, మన అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. సిద్దిపేట అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచి అభివృద్ధి సముదాయం సిద్దిపేట అనేలా డెవలప్ మెంట్ హబ్ గా చేసుకున్నామని, అభివృద్ధి చూసి ఓర్వలేని వాళ్లకు మన ఓటుతో బుద్ధి చెబుతామని పిలుపునిచ్చారు. అందరం కలిసి మరింత అభివృద్ధి చేసుకుందామని, పార్టీ బలోపేతానికి పాటు పడదామని హరీష్ రావు సూచించారు. పార్టీలో చేరిన వారి అందరికి గుర్తింపు ఉంటుందని, సముచిత స్థానము కల్పిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News