Thursday, December 26, 2024

అసెంబ్లీలో ఉత్తమ్ వర్సెస్ హరీష్ రావు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్రస్టేషన్ తాను అర్థం చేసుకుంటానని, ఉత్తమ్ పుట్టు కాంగ్రెస్ వాది ఆయనకు సిఎం కాలేదని బాధ ఉండొచ్చని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  కృష్ణా ప్రాజెక్టులు, కెఆర్‌ఎంబి సంబంధిత అంశాలపై ఉత్తమ్-హరీష్ రావు వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఉత్తమ్ రీకౌంటర్ ఇచ్చారు. సిఎం కుర్చీపై కెసిఆర్ మామతో హరీష్ రావుకు పంచాయితీ ఉండొచ్చని చురకలంటించారు. సిఎం కూర్చీపై తమకేమీ వివాదాలు లేవని ఉత్తమ్ తెలిపారు.

నీటి వాటాల పంపకాలపై కేంద్రానికి 27 లేఖలు రాశామని హరీష్ రావు తెలిపారు. నీటి వాటాల్లో 50:50 కావాలని కేంద్రానికి లేఖ రాశామని, తమపై బురదజల్లేందుకు కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని హరీష్ ధ్వజమెత్తారు. ఓడలు బండ్లు అవుతాయని, బండ్లు ఓడలు అవుతాయని, కాంగ్రెస్ పాలకులు అధికారులు, తమపైకి తప్పులు నెడుతున్నారని పేర్కొన్నారు. తీర్మానంలోని డిమాండ్లకు తాము మద్దతు తెలుపుతున్నామని, తీర్మానంలో పెట్టినవి తాము గతంలో పెట్టిన డిమాండ్లేనని స్పష్టం చేశారు. జనవరి 17న జరిగిన భేటీలో కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని తెలిపారని, ఆ భేటీలో నెలరోజుల్లో అప్పగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపిందని దుయ్యబట్టారు. తెలంగాణ ఇంజినీర్లు డ్యామ్‌లపైకి వెళ్లాలంటే కెఆర్‌ఎంబి కావాలని, ప్రాజెక్టుల అప్పగింతపై జనవరి 18 నాటి అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయని, అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదని, జనవరి 17 నాటి భేటీ మినిట్స్ మరునాడే బయటకు వచ్చాయని, మినిట్స్‌లో తప్పు ఉందని జనవరి 27న మంత్రి కేంద్రానికి లేఖ రాశారని, మరి మంత్రి పది రోజుల పాటు ఏం చేశారని, ఎందుకు స్పందించలేదని, ఫిబ్రవరి 1 నాటి రెండో మీటింగ్‌లోనూ ప్రాజెక్టులు అప్పగిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News