Friday, November 22, 2024

ప్రభాకర్‌రావును కలిసేందుకు అమెరికాకు హరీశ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అమెరికా లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ నిందితుడు, ఎస్‌ఐ బి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కలిసేందుకే హరీష్ రావు అమెరికా వెళ్లారని, ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే కెసిఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళుతుందని రోడ్లు, భవనా ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యా ఖానించారు. ఆదివారం మంత్రి కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ హరీష్‌రా వు, అమెరికాలో ప్రభాకర్ రావు కలిసినట్టు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, హరీష్‌రావు ఏ విమానంలో వెళ్లాడో, ఎక్కడ కలిశాడో నిరూపిస్తానని మంత్రి కోమటిరెడ్డి అ న్నారు. ప్రభాకర్ రావును కలవలేదని హ రీష్ రావు ప్రమాణం చేస్తారా అని సవాల్ వి సిరారు.

తాను దేనికైనా సిద్ధమేనని ఆయన తెలిపారు. కెసిఆర్‌ను మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు  అని పిలవద్దని, రాక్షసుడు అనాలన్నారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్ చేయించారని, ప్రభాకర్ రావు అనే రిటైర్ట్ అధికారిని అడ్డం పెట్టుకొని ఆయన కింద ఓ రౌడీ గ్యాంగ్ రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అనే రౌడీలతో బిజినెస్‌మెన్‌లను, నాయకులను బెదిరించి లక్షల కోట్లు దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ మంత్రులమని ఎక్కడైనా చెప్పుకోవాలంటే సిగ్గుపడే పరిస్థితికి తెలంగాణను తీసుకొచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు రెండురోజుల క్రితం అమెరికా వెళ్లారని, ప్రభాకర్ రావును కలిసేందుకే హరీష్ రావును కెసిఆర్ అమెరికా పంపారని ఆయన ఆరోపించారు.

రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేవరకు ప్రభాకర్ రావు ఇండియా రావద్దని….
రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేవరకు ఇండియా రావద్దని ప్రభాకర్ రావుకు చెప్పడానికే హరీష్‌ను కెసిఆర్ అమెరికా పంపారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. అంతేగాక బెయిల్ కోసం లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించేలా కెసిఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్నారు. బిఆర్‌ఎస్ నాయకులు అన్నిచోట్ల బిజెపికే ఓట్లు వేయించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం కెసిఆర్ మాటలు వింటుంటే బాధ అనిపిస్తుందని, మంత్రి పదవి రాక తెలంగాణ ఎత్తుకున్నడు తప్ప, తెలంగాణ మీద, ప్రజల మీద ఏ అవగాహన లేదని ఆయన దుయ్యబట్టారు. ఎవరు అవునన్నా, కాదన్నా తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి, గద్దెనెక్కిన తర్వాత పదేళ్ల పాటు సోనియాను, రాహుల్‌ను నోటికి వచ్చినట్టు కెసిఆర్ తిట్టారని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు.

ఎల్లుండితో ఆ పార్టీ దుకాణం క్లోజ్
కెసిఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ఎల్లుండితో ఆ పార్టీ దుకాణం క్లోజ్ అని, పార్టీలో ఎవరు ఉండరని, ఉన్నవాళ్లు కూడా ఈ కుటుంబంతో పాటు జైళ్లో ఉంటారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి సోరంగానికి రూ.1350 కోట్లు ఖర్చు పెట్టామని, దాన్ని ముట్టుకోకుండా ఎన్నికల ముందు వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని పూర్తి చేయిస్తానని 10 ఏళ్లలో 10 కి.మీ.లు కూడా తవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. అవసరం లేని కాళేశ్వరం కట్టి, ప్రపంచంలో వింత అంటే అది మూడేళ్లకే కూలిపోయిందన్నారు. రైతుబంధు వల్ల వేల ఎకరాలు ఉన్నవాళ్లు బాగుపడ్డారని, పేద రైతులు ఒక్కరు కూడా బాగుపడలేదన్నారు. మల్లన్న సాగర్ తో ఫాంహౌజ్ లోకి కాలువ వేసుకొని కెసిఆర్ వడ్లు పండించుకుంటున్నాడని, రైతులకు వరి వేస్తే ఉరి అని ఆయన వరి పండించి కోట్లు సంపాదిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. సంక్షేమ పథకాలు వదిలిపెట్టి డ్యాంలు కట్టి కమీషన్ తీసుకున్నారని, ధరణి పెట్టి లక్ష ఎకరాలు దోచుకున్నాడని, లిక్కర్ స్కాంలు, టానిక్ షాపులు పెట్టి ప్రజలను దోచుకున్నాడని, వీటి గురించి మాట్లాడటానికి అసెంబ్లీకి రమ్మంటే రాకుండా నల్లగొండ పోయి సభ పెట్టారని, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నల్లగొండ పోవడానికి సిగ్గుండాలి అన్నారు.

పంద్రాగస్టుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం
పంద్రాగస్టుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రూ.26 వేల కోట్లు వడ్డీలకే చెల్లించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జాతీయ బ్యాంకుల వద్ద 10 నుంచి 12 శాతం వడ్డీకి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని ఆయన అరోపించారు. చేపలు, గొర్రెల పంపిణీ పేరిట గత ప్రభుత్వం రూ.వేల కోట్లు కుంభకోణం చేశారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 70 వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్పీ నిర్వహించలేదని మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలను బయటపెడతామన్న కెసిఆర్ అసెంబ్లీకే రాలేదన్నారు. విద్యుత్ కొరత వల్ల ఒక్క ఎకరం పొలం కూడా ఎండిపోలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News