Saturday, November 23, 2024

అభిమాని ఇంటికి ఆరడుగుల బుల్లెట్

- Advertisement -
- Advertisement -

Harish Rao went to the his fan house

వీరాభిమాని ఇంట్లో.. పండుగ వాతావరణం

హైదరాబాద్ : తడబోయిన విజయ్.. నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని నల్లబెల్లి మండలం కొండైలు పల్లి గ్రామం. చిన్న నాటి నుంచి మంత్రి  తన్నీరు హరీష్ రావు వీరాభిమాని. మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో తండ్రి తో కలిసి అనేక స్వరాష్ట్ర ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆనాటి సమైక్య పాలకులకు తెలియజెప్పారు. అప్పటి ఉద్యమ నాయకులు కేసిఆర్, తన్నీరు హరీష్ రావు లు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ… యువత లో భావజాల వ్యాప్తికి కృషి చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తడబోయిన విజయ్ సామాజిక మాధ్యమాలలో క్రియాశీలకంగా ఉంటూ తెలంగాణ ప్రభుత్వ పథకాల పై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

పలు ప్రముఖ తెలుగు దినపత్రికల లో తెలంగాణలో ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వం చేపడుతున్న పథకాల పై ప్రజలను చైతన్యం చేస్తూ వందలాది వ్యాసాలు రాసారు… రాస్తున్నారు. మంత్రి  తన్నీరు హరీష్ రావు వీరాభిమాని గానే కాకుండా… ప్రభుత్వ కార్యక్రమాల ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విజయ్ చేస్తున్న కృషి మంత్రి తన్నీరు హరీష్ రావు ను ఆకర్షించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాకుండ, తెలంగాణ పునర్నిర్మాణంలో క్రీయశీలకంగా ఉంటూ తడబోయిన విజయ్… తెలంగాణ విజయ్ గా పాపులర్ అయ్యాడు. కాగా శుక్రవారం సాయంత్రం నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భం గా తడబోయిన విజయ్ నల్లబెల్లి సమీపంలో ఉన్న గ్రామంలోని తన ఇంటికి రావాల్సిందిగా మంత్రి తన్నీరు హరీష్ రావు ను ఆహ్వానించారు.

అభిమాని విజయ్ కోరిక మేరకు.. విజయ్ ఇంటికి వెళ్ళారు. విజయ్ కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సాగు చేస్తున్న పంటల గురించి విజయ్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. విజయ్ కుటుంబ సభ్యుల తో గ్రూప్ ఫోటో దిగారు. మంత్రి తన్నీరు హరీష్ రాకతో విజయ్ కుటుంబంలో ఆనందం వెల్లువెత్తింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి, అది ఆరడుగుల బుల్లెట్, ట్రబుల్ షూటర్, అభిమాన జన నాయకుడు మంత్రి తన్నీరు హరీష్ రావు కొండైలు పల్లి గ్రామం కు తొలిసారి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News