Thursday, January 23, 2025

తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయండి: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao writes letter to FM Nirmala Sitharaman

హైదరాబాద్: కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుద‌ల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు శనివారం లేఖ రాశారు. ‘పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేళ్ల బకాయిలు రూ.900కోట్లు విడుదల చేయాలి. నిదుల విడుదలతో పాటు గ్రాంట్ ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడిగించాలి. నీతి ఆయోగ్ సూచనతో రూ.24.205కోట్లు విడుదల చేయాలి. 14వ ఆర్థిక సంఘం సిఫార‌సుతో స్థానిక సంస్థలకు రూ.817.61కోట్లు ఇవ్వాలి. 15వ ఆర్థిక సూచనతో తెలంగాణకు రూ.723కోట్ల ప్రత్యేక గ్రాండ్ ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న ఐజిఎస్టీ నిధులు రూ. 210కోటలను కూడా సర్దుబాటు చేయాలి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి సంవత్సరం కేంద్ర పొరపాటున తెలంగాణకు రావాల్సిన రూ.495.20కోట్లను ఏపికి కేటాయించారు. తెలంగాణకు రావాల్సిన ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయాలి’ అని లేఖలో మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

Harish Rao writes letter to FM Nirmala Sitharaman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News