Friday, November 15, 2024

ఉత్తమ్ కు లేఖ రాసిన హరీష్ రావు… ఆ రిజర్వాయర్లకు నీళ్లను విడుదల చేయాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ తెలిపారు. నీళ్లు విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తెలియజేశారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయిందని, కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన హరీష్ రావు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News