- Advertisement -
కెప్టెన్ అమరీందర్‌కు హరీశ్ రావత్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలని, ఏ విధంగాను బిజెకి మేలు చేయవద్దని పంజాబ్ ఎఐసిసి ఇన్‌చార్జ్ హరీశ్ రావత్ శుక్రవారం ఆయనకు విజ్ఞప్తి చేశారు. కెప్టెన్‌ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఆయన ఒత్తిడితో ఉన్నట్లు ఆయన ఇటీవలి ప్రకటనలను చూస్తే అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్‌ను వదిలిపెట్లాన్న నిర్ణయాన్ని అమరీందర్ పునరాలోచించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోను బిజెపికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగాను తోడ్పడవద్దని రావత్ కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చేసినదంతా కూడా అమరీందర్ గౌరవ ప్రతిష్ఠలను కాపాడడం కోసం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను మెరుగుపర్చడం కోసమేనని కూడా రావత్ అన్నారు.
- Advertisement -