సిఎం కెసిఆర్ చొరవతో 10వేల ఎకరాల్లో పంటకు ప్రాణం
మన తెలంగాణ/గజ్వేల్: అన్నదాతల సమస్యపై ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో సి ఎం కెసిఆర్ స్పందించారు. చిరుపొట్ట దశలో ఉన్న పదివేల ఎకరాల వరిపంటకు నీరిచ్చి తమను ఆదుకోవాలని కోరిన రైతుల ఆవేదనను మంత్రి హరీశ్ రావు ఫోన్ ద్వారా విన్న సిఎం కెసిఆర్ వెంటనే కొండపోచమ్మ సాగర్ నీటిని కూడవె ల్లి వాగులోకి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీం తో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రైతన్నలంతా మంత్రి హరీశ్ రావుకు, సిఎం కెసిఆర్‌కు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం గజ్వేల్ ఎఎంసి యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొడకండ్ల , బూరుగుపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు చిరుపొట్ట దశలో ఉ న్న తమ వరిపంటకు నీరందించి కాపాడాలని సి ద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పరిసర మం డలాల రైతాంగం ఆదివారం మంత్రి హరీశ్ రావు ను కోరారు. కొండపోచమ్మ సాగర్ నీటిని కూడవెల్లి వాగులోకి విడుదల చేస్తే ఆ వాగులో సుమా రు 36 చెక్‌డ్యామ్‌లు నీటితో నిండుతాయని, దాంతో సమీప మండలాలకు భూగర్భ జలాలు పెరిగి బోర్లకు నీరుచేరి తమ వరిపంట దక్కుతుందని మంత్రి హరీశ్ రావును కోరారు. దాంతో స్పందించిన మంత్రి హరీశ్ రావు అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి వెంటనే క్షేత్ర స్థాయిలో కొడకండ్ల సమీపంలోని కూడవెల్లి వాగును సందర్శించారు. అక్కడికి సమీపంలో ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లే కాలువ కొడకండ్ల జంక్షన్ సమీపంలో ఒక చిన్న కాలువను కూడవెల్లి వాగులోకి తోడి దానిద్వారా నీటిని విడుదల చేస్తే సమస్య కు పరిష్కారం ఉంటుందని అధికారులతో మంత్రి చర్చించిన తర్వాత అభిప్రాయానికి వచ్చారు. వెంటనే సిఎం కెసిఆర్ కు ఫోన్ చేసి రైతుల సమస్య తీవ్రతను వివరించి పంటను కాపాడాలని మంత్రి హరీశ్ రావు కోరారు. రైతుల ఆవేదనను రైతుల సమక్షంలోనే ఫోన్‌లో సిఎం కెసిఆర్‌తో మాట్లాడారు. రైతుల పంట కాపాడాలన్న ఉద్దేశ్యంతో సిఎంకెసిఆర్ తక్షణమే స్పందించారు. మంగళవారం ఉదయం కూడవెల్లి వాగులోకి కొండపోచమ్మ సాగర్ నీటిని విడుదల చేయాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. దీంతో నీరందకుండా ఉన్న సుమారు పది వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వరిపంటకు ఇక దోకా లేకుండా పోయింది. ఈ పంటకు మంగళవారం పుష్కలంగా నీరందే అవకాశం వచ్చినట్లయింది. తమ సమస్యపై స్పందించిన మంత్రి హరీశ్ రావు వెంటనే సిఎం దృష్టికి తీసుకు వెళ్లటం ఆ వెంటనే అప్పటికప్పుడే సిఎం కెసిఆర్ స్పందించి నీటి విడుదలకు ఆదేశాలివ్వటం పట్ల రైతాంగంలో హర్షాతి రేకం వ్యక్తం చేశారు. సిఎంకు గజ్వేల్ పరిసర ప్రాంతాల రైతులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎఎంసి చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు డా. యాదవ రెడ్డి, మాదాసు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు బెండె మధు నీటిపారుదల శాఖ ఇంజనీర్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రేపే కూడవెల్లి వాగులోకి 5 క్యూసెక్కుల నీరు విడుదల
ఆదివారం సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయంతో కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాలకు చెందిన గజ్వేల్, జగదేవ పూర్, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి మండలాలకు చెందిన వరి రైతాంగానికి లబ్ధిచేకూరుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సుమారు 5 క్యూసెక్కుల గోదావరి జలాలను మంగళవారం కూడవెల్లి వాగులోకి విడుదల చేయనున్నామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా నీటివిడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి రైతును రాజును చేయాలన్న ధ్యేయంతో సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషిచేస్తారని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా తెలిపారు.