Monday, November 18, 2024

ఆర్థిక పునర్నిర్మాణమే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

మన రాజకీయ ప్రయోజనాలకోసం అధికార పక్షం తెలంగాణను అప్పు ల రాష్ట్రంగా ప్రచారం చేయవద్దని బిఆర్‌ఎస్ ఎం ఎల్‌ఎ, మాజీ ఆర్థికశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. బుధవారం సభలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై హరీశ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రూ.72వేల కోట్లు రైతుబంధు కింద పెట్టుబడి సాయంగా అందించామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కీర్తి, పరపతి పెంచామని తెలిపా రు. రాజకీయం కోసం అప్పుల రాష్ట్రంగా ప్రచారం చేయవద్దని చెప్పారు. తెచ్చిన ప్రతి రూపాయి అ ప్పును రాష్ట్ర ఆర్థిక పునర్నిర్మాణానికే చామని చెప్పారు. ప్రతి రూపాయి అప్పుకు వెయ్యి రూపాయల ఆస్తి సమకూర్చి పెట్టామని వివరించారు. తెలంగాణకు ఉన్న రుణాలు దీర్ఘకాలిక రు ణాలని స్పష్టం చేశారు. ఈ రుణాలు అన్నీ పదేళ్ల తర్వాత  చెల్లించాల్సినవేనని తెలిపారు. ఈ శ్వేతపత్రం ఒక తప్పుల తడక, అంకెల గారడీ అన్నారు. ఆరు గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు సాకులు వెదుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందని, అనేక ప్రభుత్వ సంస్థలు చెప్పాయని తెలిపారు. ఆరోగ్య రంగంలో వ్యయాన్ని ఆరు రెట్లు పెంచామని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన డబ్బు రూ.లక్ష కోట్ల వరకూ ఆగిపోయిందని తెలిపారు.

ఎస్‌పివిల ద్వారా తీసుకున్న రుణాలను కూడా రాష్ట్ర అప్పులుగా చూపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం హామీ లేని రుణాలను కూడా ప్రభుత్వ అప్పుగా చూపించారని మండిపడ్డారు. ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని వాటిని కూడా చెల్లించాలని తప్పుగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 15.6 శాతం వృద్ధిరేటుతో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపామని తెలిపారు. ఈ దశలో మంత్రి శ్రీధర్ బాబు కల్పించుకుని సత్యదూరమైన మాటలు చెప్పి సభను పక్కదారి పట్టించవద్దన్నారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం పూర్తి తెలుసుకున్న తర్వాత సభలో మాట్లాడాలని సూచించారు. సత్యదూరమైన మాటలు చెప్పి సభను పక్కదారి పట్టించవద్దని హెచ్చరించారు. లెక్కల్లో తప్పొప్పులు ఉంటే ఆర్థిక మంత్రి చెబుతారని పేర్కొన్నారు. నివేదిక ఎవరో తయారు చేశారనే మాటలు సరికాదని హితవు పలికారు. హరీశ్‌రావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం హరీశ్‌రావు మట్లాడుతూ నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు. ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్ పాలన కొనసాగించాలని సూచించారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనపడుతుందని విమర్శించారు. శ్వేత పత్రంలో ప్రజలు.. ప్రగతి కోణం లేదని ఆరోపించారు.శ్వేతపత్రంలో రాజకీయ ప్రత్యర్థులపై దాడి వాస్తవాల వక్రీకరణే ఉందని అన్నారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయండని సూచించారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సస్పెండ్ అయిన ఆంధ్రా అధికారితో నివేదిక తయారు చేయించారని ఆరోపించారు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారని మండిపడ్డారు. సీఎం పాత గురువు పాత శిష్యులు ఈ నివేదిక తయారు చేయించారని కావాలంటే వారి పేర్లుతో పాటు ఆధారాలు కూడా బయటపెడతని హరీష్‌రావు తెలిపారు.

అప్పులు, జీఎస్డీపీ నిష్పత్తిని ప్రగతికి కొలమానంగా తీసుకుంటారని అన్నారు. అప్పులు, జీఎస్డీపీ నిష్పత్తిని నివేదికలో చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గత తొమ్మిదేళ్ళలలో చాలా రంగాల్లో మెరుగ్గా ఉందన్నారు. కానీ వైట్ పేపర్ లో ప్రభుత్వం తనకి అనుకూలంగా లెక్కలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు ఉన్నాయనాయన్నారు. ఈ దశలో ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇచ్చిన శ్వేత పత్రం లెక్కల్లో తప్పు ఉంటే చెప్పండని కోరారు. కానీ.. ఎవరి పేరులో చెప్పి తప్పుదారి పట్టించొద్దని అన్నారు. రికార్డు నుండి హరీష్‌మాటలు తొలగించాలని కోరారు. దీంతో హరీష్ రావు మాట్లాడుతూ.. వాళ్లకు కన్వినెంట్ గా తయారు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు కొలిచే విధానం ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారని అన్నారు. తెలంగాణ కంటే 22 రాష్ట్రాల్లో అప్పు ఎక్కువ తీసుకున్నాయన్నారు.

రాజస్థాన్.. 5.37 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు. కర్ణాటక కూడా 5 లక్షల కోట్లు అప్పు చేసిందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆస్తుల కల్పన చేశామన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా శ్వేత పత్రం ఉందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో అధ్భుత ప్రగతి సాధించామని హరీష్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News