Monday, December 23, 2024

హరితహారం తెలంగాణకు మణిహారం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పెద్దకల్వల డిగ్రీ కళాశాలలో హరితోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దా సరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దాసరి మమతలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలో పుట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు.

ముందు తరాలకు స్వచ్చమైన వాతావరణం అందించేలా మొక్కలను పెంచుతున్నామన్నారు. మొక్కలు విరివిగా నాటడం వల్ల వాతావరణ కాలుష్య నివారణతోపాటు సకాలంలో వర్షాలు పడుతాయన్నారు. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న మెప్మా, ఆర్పీ మహిళలు, మున్సిపల్ సిబ్బంది, డిగ్రీ కళాశాల సిబ్బంది, బీసీ హాస్టల్ సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.

అలాగే 3వ వార్డులో అగ్రిమాపక కేంద్రంలో మొక్కలు నాటారు. మున్సిపల్ పరిధి లో ప్రతి వార్డులో రానున్న వర్షాకాలం దృష్టా విరివిగా మొక్కలు నాటుతామని మున్సిపల్ చైర్మన్ దాసరి మమత తెలిపారు. పట్టణంలో 50 వేల మొక్కలు నాటడం లక్షంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, మేనేజర్ శివ ప్రసాద్, మార్కెట్ చైర్మన్ సురేందర్, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అగ్నిమాపక కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ దాసరి మమత, ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్‌ఐ శివ ప్రసాద్, కౌన్సిలర్ భిక్షపతి, ఎల్‌ఎఫ్ మహేందర్, అగ్నిమాపక సిబ్బంది మొక్కలు నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News