Wednesday, January 22, 2025

అందరి కృషి వల్లే హరితహారం విజయవంతం

- Advertisement -
- Advertisement -
  • రోడ్డుకు ఇరువైపులా మొక్కలతో పచ్చనిహారం పరిచినట్లు ఉండటం సంతోషకరం
  • హరితహారంపై ముఖ్యమంత్రి ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్

మెదక్: జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరి కృషి వల్లే హరితహారం కార్యక్రమం విజయమవుతోందని అదే స్ఫూర్తితో మరింత పచ్చదనం విరజిల్లేలా రో డ్లకు ఇరువైపులా మొక్కలు నాటి అందంగా కనిపించేలా చూడాలని, ఈ విషయంలో అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది మరింత కృషి చేస్తే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో హరితహారంపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని జిల్లా క లెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ… దశాబ్ధి సంపద వనాల్లో నాటే మొక్కలు పెద్దవిగా ఉండేలా చూడాలని ఈ విషయంపై వివరాలను అడిగి తెలుసుకొన్నారు. అలాగే వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండటం తాను గమనించానని అన్నారు.

దీంతో పాటు హైదరాబాద్ నుంచి చేగుంట వచ్చే మార్గంలో ట్రీ గార్డులు ఏర్పాటు చేయలేదని… వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు పడిపోయి ఉన్న ట్రీ గార్డుల స్థానంలో కొత్తవి పెట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్‌కు సూచించారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎంపిడిఓలు ప్రత్యేక సమావేశం నిర్వహించి అవసరమైన సూచనలు చేయాలని ఆదేశించారు. అలాగే చేగుంట – మెదక్ మార్గంలో తాను వచ్చే సమయంలో మొక్కలను చూస్తే ఎంతో ఆనందం కలిగిందని… రోడ్డుకు ఇరువైపులా మొక్కలు, చెట్లు ఉండటం వల్ల అందంగా, ఆహ్లాదం గా అనిపించందని ప్రియాంక వర్గీస్ వివరించారు. అందరి కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్లు పూర్తి చేయాలని ఈ విషయంలో ని ర్లక్ష్యం వహించరాదని తెలిపారు.

ప్రస్తుతం ఆయా మండలాల్లో వర్షా కాలంలో మొక్కలు నాటాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులకు వివరించారు. ప్ర స్తుతం మొక్కలు నాటడం వల్ల వేసవి కాలం వరకు మొక్కలు పెరిగి పెద్దవవుతాయని అందుకు అవసరమైన ప్రదేశాల్లో తప్పకుండా మొక్కలు నాటాలని అన్నారు. అలాగే జిల్లాలోని అన్ని మం డలాల్లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ ఆయా మండలాల అధికారులకు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డిఆర్‌డిఓ శ్రీనివాస్, అటవీ శాఖ అధికారి రవిప్రసాద్, జిల్లా స్థాయి అధికారులు, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమీక్ష సమావేశం అనంతరం జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ కలెక్టర్‌ను సందర్శించిన ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ కలెక్టరేట్ ఆవరణలో ఎలాంటి మొక్కలు నాటాలనే వివరాలను అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News