Wednesday, November 6, 2024

హరితహారం గొప్ప యజ్ఞం

- Advertisement -
- Advertisement -

మొక్కలు నాటడం అంటే ప్రకృతిని ఆరాధించడమే
పుట్టిన రోజు సందర్భంగా మొక్కలను నాటిన రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర

మనతెలంగాణ/ హైదరాబాద్ : వృక్షో రక్షతి రక్షితిః స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి చెట్లుగా ఎదిగేందుకు బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు శనివారం శిల్పారామంలో తన పుట్టిన రోజు సందర్భంగా బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ బీడు భూములతో సర్కార్ చెట్లు తుమ్మ చెట్లుతో ఎన్నో కష్టాలకు బాధలకు గురైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే ఆకుపచ్చని తెలంగాణగా ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దారని వెల్లడించారు.

ఉక్కు సంకల్పంతో హరితహారం పథకాన్ని కెసిఆర్ అమలు చేస్తూ దేశంలోనే రెండో స్థానానికి తెలంగాణ ఎదిగిందన్నారు. హరితహారం గొప్ప యజ్ఞమని.. ప్రతి ఒక్కరూ అందులో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు వేణుగోపాల్ గౌడ్, శివారెడ్డి శ్రీనివాస్‌చారి, బిఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు జావేద్, తెలంగాణ ఫెవికాల్ ఛాంపియన్ క్లబ్ అధ్యక్షులు మనోహర్ ,ప్రకాష్, రాము పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News