Saturday, November 23, 2024

నాగోల్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో హరితహారం….

- Advertisement -
- Advertisement -

Harithaharam event in Nagole pallavi engineering college

మేడ్చల్: నాగోల్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సుమారు 300మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి రాచకొండ సైబర్ క్రైమ్ ఎసిపి హరినాధ్, కాలేజ్ డైరెక్టర్ మురళీ కృష్ణ, ప్రిన్సిపాల్ రాజులు పాల్గొని స్టూడెంట్స్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎసిపి హరినాథ్ మాట్లాడారు. వనరులను రక్షించుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. మానవ సమాజానికి కీలకమైన చెట్లను రక్షించుకొని విధంగా విద్యార్థులకు వివరించి భవిష్యత్ తరాలకు ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. గతంతో నాటిన మొక్కలను కలిపి ఇప్పటి వరకు మొత్తం 70వేల మొక్కలు నాటడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పల్లవి మేనేజ్మెంట్ ను ఆయన అభినందించి ఇదే తరహాలో అన్ని కాలేజీల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News