Monday, December 23, 2024

హరితహారం పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : జిల్లాలో 9వ విడత హరితహారం కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలనిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. 9వ విడత హరితహారంపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సమావేశం నిర్వహించారు. 2022..23 సంవత్సరం జిల్లాలో 40.88లక్షల మొక్కలు నాటాలని, మున్సిపాలిటీలో, గ్రామాలలో మొక్కలు నాటేందుకు గుర్తించిన ప్రాంతాలలో మొక్కలు నాటాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయని, వచ్చే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ సమయాన్ని గుంతలు తవ్వకానికి వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. హరితహారం కింద నాటే మొక్కల వివరాలు నిర్ణీత నమూనా ఫారంలో ప్రణా ళికలను నమోదు చేసి అందజేయాలని, నర్సరీలో మొక్కల పెంపకంపై అటవీ అధికారులు సాంకేతిక పరిజ్ఞానం, మార్గదర్శకాలు అందజేయాలని కలెక్టర్ సూచించారు

. జిల్లాలో రోడ్లవెంబడి మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటడం రెండవ ప్రాధాన్యత కింద తీసుకోవాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటుచేసే దిశగా మొక్కలుఉ నాటడానికి 3వ ప్రాధాన్యత కింద తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డిఆర్‌డిఓ పురుషోత్తం, జడ్పి సిఈఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అనిల్, ఎంపిడిఓలు, ఎఫ్‌డిఓ, ఎంపివోలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News