Wednesday, January 22, 2025

19న తెలంగాణ హరితోత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 19వ తేదీ సోమవారం “ తెలంగాణ హరితోత్సవం” ఉంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టాణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు. కాగా ఇందులో భాగంగా తెలంగాణ అటవీశాఖ బుధవారం ట్విట్టర్ వేదికగా ట్విట్ చేస్తూ హరితహారంలో భాగంగా ఈ నెల 19న గ్రీన్ వీడియో ఛాలెంజ్ కార్యక్రమాన్ని కూడా చేపడుతామని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెంలోని కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచువరీ వీడియోను పోస్ట్ చేసింది.

అలాగే తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో పరిఢవిల్లాలనే సిఎం కెసిఆర్ ఆకాంక్షలకు నిలువుటద్దమే ఈహరితహారం అని అందుకు అనుగుణంగా మొక్కలను నాటుదామని తెలిపింది. కాగా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అత్యంత విజయవంతమైన సంస్థగా ఎదిగిందని ట్విట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News