సిటీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవాలు భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా సోమవారం హరితోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిహెచ్‌ఎంసి అర్భన్ బయోడైవర్సిటీ వి భా గం ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా ఎక్కడిక్కకడ చె ట్లను నాటారు. బంజారాహిల్స్ డివిజన్ ఎమ్మెల్యే కాలనీలో జరిగిన హరిత ఉత్సవాల్లో పాల్గొన్న మేయర్ గద్వాల విజయలక్ష్మి మొక్కలు నాటారు. అదేవిధంగా ఎవిఎం డి ఆధ్వర్యంలో సంజీవయ్య పార్కులో డైరెక్టర్ ఎన్ .ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో అధికారులు, సిబ్బంది మొ క్కలను నాటారు. అదేవిధంగా నగర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తమ తమ పరిధిలోని పార్కుల్లో బహిరంగ ప్రదేశాల్లో మొక్కలను నాటారు.
హరితోత్సవాన్ని పురస్కరించుకుని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రిక తెలంగాణ హరితహారంలో భాగంగా జిహెచ్‌ఎంసి నగర వ్యాప్తంగా మొక్కలను నాటి గ్రీన్ సిటీగా ప్రపంచంచే గుర్తింపబడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది స్ఫూర్తిగా తీసుకొని నగరంలో 10 పార్కులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌ను మరింత పచ్చని హైదరాబాద్‌గా మార్చేందుకు జంటనగరాల్లో విస్తారంగా ఉన్న ప్రదేశాలలో అడవుల పెంపకాన్ని చేపట్టడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయడం మూలంగా ఆహ్లాదకరమైన జీవ-సౌందర్య వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అవెన్యూలు, బహిరంగ ప్రదేశాలలో చెట్ల జాతులను నాటడం ద్వారా నీరు, నేల ఇన్-సిటు పరిరక్షణ ద్వారా భూగర్భ జలాలు పెంపొందిచడం జరిగిందన్నారు.
తెలంగాణా కు హరితహారం ఫ్లాగ్ షిప్ కార్యక్రమంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్స్, కాలనీ ప్లాంటేషన్స్, ఇనిస్టిట్యూషనల్ ప్లాంటేషన్స్, ఓపెన్ స్పేస్ ప్లాంటేషన్స్, స్మశాన వాటికలు మొదలైన ప్రదేశాల్లో వివిధ వినూత్న పద్ధతిలో జి హెచ్‌ఎంసి పచ్చదనం పెంపకాన్ని చేపడుతోందని తెలిపారు. 14జూన్, 2014 నుండి ఇప్పటి వరకు చేపట్టిన హరితహారం ద్వారా మొక్కల పెంపకం ద్వారా పచ్చదనం శాతం పెరగడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడడం గమన్హారమని పేర్కొన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ మహా నగరం ప్రపంచంలోనే ట్రీ సిటీగా, గ్రీన్ సిటీగా అవార్డులను సొంతం చేసుకోవడమ మనందరికీ గర్వకారణమని మేయర్ పేర్కొన్నారు.