Tuesday, November 5, 2024

సింగరేణి వ్యాప్తంగా ఉత్సాహంగా హరితోత్సవం

- Advertisement -
- Advertisement -
ప్రతి మనిషి కనీసం మూడు మొక్కలు నాటాలన్న డైరెక్టర్ బలరామ్

హైదరాబాద్ : జీవుల మనుగడ కోసం, పుడమి భవిత కోసం ప్రతి వ్యక్తి కనీసం మూడు మొక్కలు నాటి వాటిని పెంచాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ ( ఫైనాన్స్ అండ్ పర్సనల్ ) ఎన్. బలరామ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశం మేరకు సింగరేణివ్యాప్తంగా సోమవారం హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్బంగా బలరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలంగాణలో చేపట్టిన హరితహారం ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణహిత కార్యక్రమమని, ఆయన స్ఫూర్తిగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా పచ్చ దనంపై అవగాహన కలిగించిందన్నారు.

హరితహారం వల్ల తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా అడవుల అభివృద్ధి జరగడం చాలా గొప్ప విషయం అన్నారు. సింగరేణి సిఎండి ఎన్. శ్రీధర్ ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా గత 8 సంవత్సరాలలో 5.71 కోట్ల మొక్కలను నాటామన్నారు. సింగరేణి చేపట్టిన హరిత హారం సత్ఫలితాన్ని ఇస్తోందని, సింగరేణి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఎంతో దోహదపడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి సంరక్షిస్తే జీవులకు కావలసిన ఆక్సిజన్ ను అందించినవారమవుతామన్నారు.

జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్ మాట్లాడుతూ ( డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ) ఎన్.బలరామ్ స్వయంగా 16 వేల మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన సారథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కనుక ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను కూడా స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, అధికారుల సంఘం జనరల్ సెక్రెటరీ ఎన్ వి రాజశేఖర్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News