నార్తాంప్టన్ :ఇంగ్లండ్‌తో జరిగిన వుమెన్ తొలి టి20 మ్యాచ్‌లో హర్లిన్ డియోల్ అద్భుతమైన క్యాచ్‌తో ఆకట్టుకుంది. లాంగ్ ఆఫ్ బౌండరీ వద్ద హర్లీన్ క్యాచ్ అందుకున్న తీరు ఆ మ్యాచ్‌కే హైలెట్. నిజానికి ఇండియన్ ప్లేయర్ హర్లీన్ ఆ క్యాచ్ పట్టుకునేందుకు ఎంతో సమయస్పూర్తిని ప్రదర్శించింది. లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్.. ఇంగ్లండ్ బ్యాట్స్‌వుమెన్ అమీ ఎల్లన్ జోన్స్ కొట్టిన షాట్‌ను గాలిలోకి ఎగిరి అందుకున్నది. కానీ బ్యాలెన్స్ తప్పి బౌండరీ లైన్ దాటుతున్నట్లు గమనించిన హర్లీన్ తన చేతిలో ఉన్న బంతిని మైదానంలోకి విసిరింది. మళ్లీ బౌండరీ రోప్ దాటి వచ్చి.. డైవ్ చేస్తూ ఆ బంతిని అందుకుని అందర్నీ స్టన్ చేసింది. సూపర్బ్ రివర్స్ కప్‌డ్ క్యాచ్‌కు సంబంధించిన ఈ వీడియోను ఈసీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇప్పటికే మిలియన్ వ్యూస్ సాధించిన ఈ వీడియోను రీట్వీట్ చేసిన టీమిండియా టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్… ‘‘క్రికెట్ ఫీల్డ్‌లో ఇలాంటి గుడ్ క్యాచ్‌ను మనం ఎప్పటికీ చూడలేం. హర్లిన్ డియోల్ ఫీల్డింగ్.. నిజంగా టాప్ క్లాస్’’ అంటూ హర్లిన్‌పై ప్రశంసలు కురిపించాడు.
A fantastic piece of fielding 👏
We finish our innings on 177/7
Scorecard & Videos: https://t.co/oG3JwmemFp#ENGvIND pic.twitter.com/62hFjTsULJ
— England Cricket (@englandcricket) July 9, 2021