Monday, December 23, 2024

మక్కా, మదీనా మధ్య నడిచే హైస్పీడ్ హరమైన్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్

- Advertisement -
- Advertisement -

 

Harmain Express train

జెడ్డా: ఉమ్రా యాత్రికుల కోసం ‘మక్కా నుంచి మదీనా’కు హై స్పీడ్ ట్రైన్ ‘హరమైన్ ఎక్స్‌ప్రెస్‌’ను నడపనున్నట్లు తాజాగా సౌదీ అరేబియా వెల్లడించింది. ప్రపంచం నలుమూలల నుంచి ఉమ్రా యాత్రకు పర్యాటకులు వస్తుంటారు. వారంతా పవిత్రమైన మక్కా, మదీనాలను సందర్శిస్తుంటారు. అయితే, ఈ రెండు పవిత్ర నగరాలను సందర్శించే యాత్రకులకు సమయం ఆదా చేసేందుకుగాను హై స్పీడ్ ట్రైన్‌ను నడుపుతున్నట్లు సౌదీ ప్రకటించింది. ఇక ప్రయాణికుల సౌకర్యార్థం మక్కా, మదీనా  మధ్య జెడ్డా, కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీలో సర్వీస్ స్టాప్‌లు కూడా ఉన్నాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైల్లో వెళ్లేవారు కేవలం రెండు గంటల ఇరవై నిమిషాల్లో మక్కా నుంచి మదీనాకు చేరుకోవచ్చు.

అలాగే మదీనా నుంచి మక్కాకు రావడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఇక ట్రైన్ టికెట్ ధరలు నలభై రియాళ్ల (రూ.848) నుంచి 150 రియాళ్ల (రూ.3181)వరకు ఉంటుంది. ఇందులో బిజినెస్, ఎకనామీ క్లాస్‌లు ఉంటాయి. అందుకే టికెట్ల ధరలలోనూ వ్యత్యాసం ఉంటుంది.  400 మంది వరకు ఒకేసారి ఈ హైస్పీడ్ ట్రైన్‌లో ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఈ అవకాశాన్ని ఉమ్రా యాత్రికులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు కోరారు. కాగా, హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతి ప్రకారం,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు విజిట్ వీసాపై సౌదీలో ఉండగా ఉమ్రా చేసుకోడానికి అనుమతింస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News