Wednesday, January 15, 2025

శ్రీలంక సిరీస్ చాలా కీలకం: కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్

- Advertisement -
- Advertisement -

ముంబై: శ్రీలంక సిరీస్ తమకు చాలా కీలకమని భారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. రానున్న రోజుల్లో మెరుగైన జట్టును తయారు చేసేందుకు ఈ సిరీస్ దోహదం చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించడం జట్టుకు పెద్దలోటేనని తెలిపింది. మిథాలీ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టంతో కూడుకున్న విషమని చెప్పింది. అపార అనుభవజ్ఞురాలైన మిథాలీ వంటి క్రికెటర్ లభించడం చాలా కష్టమని హర్మన్ పేర్కొంది. మరోవైపు శ్రీలంక సిరీస్ తమకు సవాల్ వంటిదేనని వివరించింది. సొంత గడ్డపై శ్రీలంకను ఓడించడం అనుకున్నంత తేలిక కాదని తెలిపింది. అయితే తమ జట్టులో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదని వ్యాఖ్యానించింది. టి20, వన్డే సిరీస్‌లలో విజయమే లక్షంగా పెట్టుకున్నామని హర్మన్ స్పష్టం చేసింది.

Harman Preet Kaur about Sri Lanka Series

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News