Monday, January 20, 2025

ఉడిపిలో ముగిసిన షూటింగ్..

- Advertisement -
- Advertisement -

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు బర్త్ డే కానుకగా విడుదలైన ‘హరోం హర’ ఫస్ట్ ట్రిగ్గర్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా చిత్ర యూనిట్ ఉడిపిలో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. షెడ్యూల్ అనంతరం హీరో సుధీర్ బాబు శ్రీ కుక్కే సుబ్రమణ్య ఆలయాన్ని దర్శించుకున్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News