Friday, March 14, 2025

హ్యారీ బ్రూక్‌కు బిసిసిఐ షాక్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌కు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఐపిఎల్‌లో ఆడకుండా రెండేళ్ల పాటు నిషేధం విధించింది. బిసిసిఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సీజన్‌లో హ్యారీ బ్రూక్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మెగా వేలం పాటలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లను వెచ్చించి బ్రూక్‌ను సొంతం చేసుకుంది. మరి కొన్ని రోజుల్లో ఐపిఎల్ ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అన్ని జట్లు మెగా టోర్నీకి సిద్ధమవుతున్నాయి.

కానీ బ్రూక్ మాత్రం తాను ఈసారి ఐపిఎల్‌లో ఆడడంలేదని ప్రకటించాడు. ఈ నిర్ణయం ఢిల్లీ షాక్ ఇచ్చింది. దీంతో వెంటనే స్పందించిన ఢిల్లీ యాజమాన్యం విషయాన్ని బిసిసిఐదృష్టికి తీసుకెళ్లింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన బిసిసిఐ సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న రెండేళ్ల పాటు ఐపిఎల్‌లో ఆడకుండా బ్రూక్‌పై నిషేధం విధించింది. మెగావేలం పాటకు ముందే బిసిసిఐ ఐపిఎల్ కోసం బిసిసిఐ కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే బ్రూక్‌పై వేటు వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News