Saturday, March 22, 2025

అందుబాటులో లేని బ్రూక్‌… నిషేధం సబబే

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై ఐపిఎల్‌లో ఆడకుండా భారత క్రికెట్ బోర్డు రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సమర్థంచాడు. సరైన కారణం లేకుండానే బ్రూక్ ఐపిఎల్‌కు దూరం కావడం సమర్థనీయం కాదన్నాడు. ఇలాంటి స్థితిలో బిసిసిఐ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పులేదన్నాడు. బిసిసిఐ తీసుకున్న చర్యలతో భవిష్యత్తులో క్రికెటర్లు కారణం లేకుండా టోర్నమెంట్ నుంచి తప్పుకునేందుకు భయపడుతారని పేర్కొన్నాడు. టోర్నమెంట్ మరి కొన్ని రోజుల్లో ఆరంభం అవుతుండగా బ్రూక్ ఒక్కసారిగా తాను అందుబాటులో ఉండడం లేదని ప్రకటించడం తనను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. ఐపిఎల్ ఫ్రాంచైజీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బిసిసిఐ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు వాన్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News