Friday, November 29, 2024

ఇంగ్లండ్ 319/5

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 319 పరుగలు చేసింది. ఆతిథ్య న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ క్రాస్, షోయబ్ బషీర్ నాలుగేసి వికెట్లను పడగొట్టారు. గుస్ అట్కిన్సన్‌కు రెండు వికెట్లు లభించాయి. కాగా, కివీస్ టీమ్‌లో కేన్ విలియమ్సన్ (93) టాప్ స్కారర్‌గా నిలిచాడు. అనంతంర తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జాక్ క్రాలి (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన జాకబ్ బెథెల్ 10 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. స్టార్ బ్యాటర్ జోరూట్ (0) సున్నాకే ఔటయ్యాడు.దీంతో ఇంగ్లండ్ 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

కొద్ది సేపటికే ఓపెనర్ బెన్ డకెట్ (46) కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఇంగ్లండ్ 71 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను హారి బ్రూక్, వికెట్ కీపర్ ఒలి పోప్ తమపై వేసుకున్నారు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆతిథ్య టీమ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇటు పోప్ అటు బ్రూక్ సమన్వయంతో ఆడుతూ ఇంగ్లండ్‌ను సురక్షిత స్థితికి చేర్చారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పోప్ 98 బంతుల్లో 8 ఫోర్లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. చిరస్మరణీయ బ్యాటింగ్‌తో అలరించిన బ్రూక్ 163 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 132 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 37(నాటౌట్) అతనికి అండగా ఉన్నాడు. దీంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 74 ఓవర్లలో 5 వికెట్లకు 319 పరుగులకు చేరింది. అయితే కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే ఇంగ్లండ్ మరో 29 పరుగులు చేయాలి.
పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్లదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News