Wednesday, January 22, 2025

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవు

- Advertisement -
- Advertisement -

మెదక్ ఎక్సైజ్ సీఐ నాగేశ్వర్‌రావు

మెదక్: గంజాయి సాగు చేసినా, విక్రయించినా కఠిన కారాగార శిక్షలుంటాయని మెదక్ ఎక్సైజ్ సీఐ నాగేశ్వర్ రావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేగోడ్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన పెద్దగొల్ల యాదయ్య తండ్రి మల్లయ్య అనే వ్యక్తి గంజాయి సాగు చేసిన కేసులో మెదక్ IADJ Court 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 50వేల రూపాయల జరిమాన విధించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు నిందితుడిని సంగారెడ్డి జైలుకు తరలించడం జరిగిందని సీఐ తెలిపారు. ఈ కేసు ట్రైల్‌లో కోర్టు కానిస్టేబుల్‌గా ప్రశాంత్ వ్యవహరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News