- Advertisement -
ఇండిగో విమానయాన సంస్ఘ మరోసారి విమర్శలు ఎదురుకుంది. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఆ సంస్థపై తనదైన శైలీలో సెటైర్లు వేశారు. ఆయన ఎక్కాల్సిన విమానం ఆలస్యం కావడమే అందుకు కారణం. ‘ఏదో ఒక రోజు ఇండిగో సిబ్బందిని భోజనానికి పిలుస్తాను.. ఆహారం సిద్ధమయ్యే వరకూ, టేబుల్ రెడీ చేసే వరకూ బయటే ఎదురుచూడమని చెబుతాను’ అంటూ హర్ష ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై ఇండిగో స్పందించింది. వీల్‌చైర్ వినియోగదారులు విమానం ఎక్కేందుకు ప్రాధాన్యత ఇవ్వడమే ఆలస్యానికి కారణమని తెలిపింది. ఆలస్యానికి చింతిస్తున్నామని.. ఈ విషయానికి తమ వద్దకు తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది.
- Advertisement -